Friday, April 26, 2024
Friday, April 26, 2024

విదేశీ ఉన్నత విద్యను దూరం చేసిన జగన్

టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల

ఒంగోలు – ఒంగోలు : అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకానికి అంబేద్కర్ గారి పేరు తొలగించి జగనన్న విదేశీ విద్యా నిధి పథకం పేరు పెట్టడాన్ని నిరసిస్తూ విదేశీ విద్యానిధి పథకానికి యధావిధిగా అంబేద్కర్ గారి పేరు కొనసాగించాలని కోరుతూ మంగళగిరి నందు రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమానికి సంఘీభావంగా ఒంగోలు పార్లమెంట్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ ( ప్రకాశం భవన్) వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు హాజరయ్యారు. మొదటగా అంబేద్కర్, మరియు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 4,923 మంది పేద విద్యార్థులకు విదేశీ విద్యను అందించామని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ మూడేళ్లలో ఒక పేద విద్యార్థి కూడా విదేశీ విద్యను అందించకపోవడం సిగ్గుచేటు ఆనాడు ఎన్నికల సమయంలో చదువుకునే ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఏడాదికి లక్ష నుండి లక్షన్నర వరకు ఖర్చు చేస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పాడు జగన్ రెడ్డి కనీసం ఈ మూడేళ్లలో విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకైనా ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. విదేశీ విద్య పథకం కోసం ఒక్కొక్క విద్యార్థికి ప్రతి ఏటా 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేశామని అంతేకాకుండా 2019 లో తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వస్తే 15 లక్షల నుండి పాతిక లక్షల వరకు ఆర్థిక సహాయం పెంచుతామని మేనిఫెస్టోలో హామీని ఇచ్చామని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాత ప్రపంచానికి మార్గ నిర్దేశకుడు అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి లాంటి మహానీయుడు పేరు విదేశీ విద్యానిధి పథకానికి పేరు తొలగించి ఆర్థిక నేరగాడు అయినటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పెట్టుకోవటం సిగ్గుచేటని తక్షణమే జగన్ రెడ్డి పేరు తొలగించి విదేశీ విద్యా నిధి పథకానికి అంబేద్కర్ గారి పేరు కొనసాగించాలని లేనిచో దళితులే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు చుండి శ్యామ్, నగర పార్టీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామరాజు గడ్డ కుసుమకుమారి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పసుమర్తి హగ్గయ్యరాజ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గునే మేరి రత్నకుమారి, రాష్ట్ర మహిళా కార్యనిర్వాక కార్యదర్శి నాలం నరసిమ్మ, తెలుగు యువత ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు ముత్తన శ్రీనివాసులు, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజ్ విమల్, ఎద్దు శశికాంత్ భూషణ్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు నావూరి కుమార్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపూడి బాబురావు, ఎల్ టి భవాని, కార్పొరేటర్ సండ్రపాటి ఓట్స్ వర్త్,తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img