Friday, April 26, 2024
Friday, April 26, 2024

నిలిచిన నిమ్మ కోతలు

విశాలాంధ్ర- హనుమంతునిపాడు: నిలకడ లేని నిమ్మ ధరలతో రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారు. గత వారం రోజులుగా కిలో రూ. 50 రూపాయలు పలికిన ధర శని,ఆదివారాల్లో నాణ్యతను బట్టి ఒక్కసారిగా కిలో రూ. 20 రూపాయలు నుంచి 30 రూపాయలకు చేరింది.వారం రోజులపాటు రైతులను ఊరించిన ధర ఒక్కసారిగా పడిపోవడంతో కూలీలు కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు.ఈ రెండు రోజుల్లో పోటీపడి నిమ్మకాయల కొనుగోలు చేసిన కమిషన్ దార్లు భారీగా నష్టపోయారు.లక్షల్లో పెట్టుబడులు పెట్టి తోటలో తీసుకున్న కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఢిల్లీ,కోల్ కత్తా,లక్నో,రాంచీ, అహ్మదాబాద్ చెన్నై, బెంగళూరు,హైదరాబాద్ లతోపాటు మన రాష్ట్రంలోని గుంటూరు,కర్నూలు,తెనాలి, మార్కెట్ కు సరుకు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడటంతో ధర ఒక్కసారిగా తగ్గించారని కమిషన్ దార్లు వాపోయారు. నాణ్యత లేని పిందెకాయలో, మచ్చ సోకిన నాసిరకం సరుకును కోతలు వేసి మార్కెట్ కు తరలిస్తుండటంతో ధర భారీగా తగ్గించారని కమిషన్ దార్లు పేర్కొంటున్నారు.ముందుగా అడ్వాన్సులు ఇచ్చి సరుకు నిల్వ చేసిన కమిషన్ దుకాణాదారులు భారీగా నష్టపోయారు.తోటల్లో కోసిన నిమ్మకాయలు ఎక్కడికక్కడే ఉండిపోవడంతో కోతలు నిలిపి వేశారు.కనిగిరి మార్కెట్ లో నిల్వచేసేందుకు కోల్డ్ స్టోరేజీ లేకపోవడంతో కోసిన కాయలు నిల్వ చేయలేకపోతున్నామని రైతులు పేర్కొంటున్నారు.ఇదే ధర కొనసాగితే ఇప్పట్లో కోలుకోలేమని కౌలురైతులు కమీషన్ వ్యాపారులు చెబుతున్నారు.మార్కెట్ కమిటీల ద్వారా నిర్ణీత ధరకు నిమ్మకాయలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని.. విజ్ఞప్తి చేస్తున్నారు

మీడియాకు సమాచారం అందించడంలో అధికారుల నిర్లక్ష్యం

పి.గన్నవరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాకు సమాచారం ఇవ్వకుండా అధికారుల నిర్లక్ష్యం వహించడం పట్ల మీడియా ప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. మండల పరిషత్తు సమావేశాల్లో జరిగే విషయాలను ప్రజలకు వివరించే బాధ్యత కలిగిన మీడియా ప్రతినిధులను సమావేశానికి మండల పరిషత్ అధికారులు పిలవకపోవడం పట్ల రకరకాల విమర్శలు వెలుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img