Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రత్యేకాధికారి ఆకస్మిక తనిఖీ

విశాలాంధ్ర`చీరాల : ఇంటిపన్ను వసూళ్లు పూర్తి స్థాయిలో వసూళ్లు చేయాలని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కార్యదర్సులు చర్యలు తీసుకొని గ్రామస్తులకు అవగాహన కల్పించాలని చీరాల మండల ప్రత్యేక అధికారి మదన్‌ మోహన్‌ శెట్టి అన్నారు. గురువారం ప్రత్యేకాధికారి మదన్మోహన్‌శెట్టి కావురుపాలెం, గవినివారిపాలెం, దేవినూతల, విజయనగర్‌ పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ కార్యక్రమంలో మదన్మోహన్‌శెట్టి మాట్లాడుతూ సచివాలయంలో ప్రజలకు అందించే సేవలను సక్రమంగా అందించాలని పన్ను వసూళ్లు,సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టర్లు అందరికి కనిపించేలా పెట్టాలని అన్నారు. రికార్డుల నిర్వహణ,మధ్యాహ్న భోజన నాణ్యత,సిబ్బంది హాజరుకు సంబంధించిన రిజిస్టర్లు ఖచ్చితంగా నమోదు చేయాలని అన్నారు. సచివాలయంలో రక్తహీనత గలిగిన వారిని గుర్తించి నమోదు చేయాలని,రైతు భరోసా పధకం గురించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని తాము చేస్తున్న పనులను నిరంతరం సమీక్షించుకోవలని అన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల మండల అభివృద్ధి అధికారి నేతాజీ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img