Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

క్రికెట్‌కు ఏబీడీ గుడ్‌బై

అన్ని ఫార్మాట్‌లకు రాం..రాం..
ఇక సెకండ్‌ ఇన్నింగ్స్‌ కుటుంబంతోనే..
ఐపీఎల్‌ ఆడటంపై అభిమానుల సందేహాలు
కేప్‌టౌన్‌ : దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివీలియర్స్‌ తన అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు వెల్లడిరచాడు. ఇక క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు చెబుతున్నట్లు ఏబీడీ చెప్పాడు. ట్విటర్‌ ద్వారా ఏబీ డివీలియర్స్‌ తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించాడు. ఇక తన అద్భుతమైన బ్యాటింగ్‌ చూసే అవకాశం తాము కోల్పోయామంటూ అభిమానులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఏబీ డివీలియర్స్‌ క్రికెట్‌ కెరీర్‌ విషయానికొస్తే.. ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ దక్షిణాఫ్రికా క్రికెట్‌కు 17ఏళ్ల పాటు సేవలందించాడు. ఇందులో 114 టెస్టులు, 228 వన్డే మ్యాచ్‌లు, 78 టీట్వంటీలు ఉన్నాయి. తన క్రికెట్‌ జీవితం ఎంతో అద్భుతంగా సాగిందని అయితే ఇక తన రిటైర్‌మెంట్‌కు సమయం వచ్చిందని తాను భావించి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని డివీలియర్స్‌ ట్వీట్‌ చేశాడు. తాను క్రికెట్‌ ఆడినంతకాలం గేమ్‌ను ఎంతో ఆస్వాదించినట్లు చెప్పుకొచ్చిన డివీలియర్స్‌.. ఇక 37 ఏళ్ల వయసులో మరింత చురుకుగా ఉండటం సాధ్యం కావడం లేదని పేర్కొన్నాడు. తన కెరీర్‌ సాఫీగా ఇంత సుదీర్ఘకాలం పాటు కొనసాగిందంటే అందుకు కారణం తన కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన మద్దతే అని స్పష్టం చేశాడు డివీలియర్స్‌. తన కుటుంబ సభ్యులు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేసుకున్నాడు. తన తల్లిదండ్రులు, భార్య, సోదరులు, తన పిల్లలు అంతా ఎన్నో త్యాగాలు చేశారని చెప్పుకొచ్చాడు. ఇక తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ అంతా కుటుంబానికే కేటాయిస్తానని స్పష్టం చేశాడు. తనకు ఇంతకాలం సహకరించిన జట్టు సభ్యులు, కోచ్‌, ఇతర జట్ల ఆటగాళ్లు, ఫిజియోలకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక దక్షిణాఫ్రికాతో పాటు భారత్‌లో తాను ఆడినప్పుడు తనకు దక్కిన గౌరవం గుర్తింపు గుర్తు చేశాడు. అందరికీ తన కృతజ్ఞతలు తెలిపాడు. దక్షిణాఫ్రికా జట్టుకైనా, టైటాన్స్‌ జట్టుకైనా, ఆర్‌సీబీ బెంగళూరు జట్టుకైనా ఏ జట్టుకు ఆడినా క్రికెట్‌ను ఆస్వాదించినట్లు డివీలియర్స్‌ చెప్పుకొచ్చాడు. తనకు ఇచ్చిన అవకాశాల గురించి ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు డెవిలియర్స్‌. ఇదిలా ఉంటే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఏబీ డివీలియర్స్‌… ఐపీఎల్‌ ఆడతాడా లేదా అనే సందిగ్ధం నెలకొంది. ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏబీ డివిలియర్స్‌ పలు మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒక్క బెంగళూరు అభిమానులకే కాకుండా ఐపీఎల్‌ ఇతర జట్లను సపోర్ట్‌ చేసే ఫ్యాన్స్‌కు కూడా డివిలియర్స్‌ ఫేవరెట్‌ బ్యాట్స్‌మేన్‌గా ముద్రవేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img