Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భారత్‌ క్లీన్‌స్వీప్‌

. రోహిత్‌, గిల్‌ మెరుపు ఇన్నింగ్స్‌
. రాణించిన హార్దిక్‌ పాండ్యా
. కాన్వే శతకం వృధా

ఇండోర్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇండోర్‌ వేదికగా మంగళవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, పర్యాటక జట్టును ఒక్క మ్యాచ్‌ కూడా గెలవనీయకుండా ఊడ్చేసింది. ఈ విజయంతో భారత్‌.. ఐసీసీ వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానానికి ఎగబాకింది. ఇప్పటికే టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న భారత్‌.. వన్డేల్లోనూ ఈ ఘనత సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌…ఓపెనర్లు రోహిత్‌ శర్మ (85 బంతుల్లో 1019 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (78 బంతుల్లో 112 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఆఖర్లో హార్ధిక్‌ పాండ్యా (38 బంతుల్లో 543 ఫోర్లు, 3 సిక్సర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో భారత్‌ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (100 బంతుల్లో 138 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలి శతకం సైతం ఆదుకోలేకపోయింది. కాన్వే మినహా మిగతా వారెవ్వరూ భారీ స్కోర్లు చేయకపోవడంతో కివీస్‌ లక్ష్యానికి 91 పరుగుల దూరంలో నిలిచిపోయింది 41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్‌ అయింది. హెన్రీ నికోల్స్‌ (42), మిచెల్‌ సాంట్నర్‌ (34) ఓ మోస్తరుగా రాణించారు. భారత బౌలర్లలో శార్ధూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. చహల్‌ 2, హార్ధిక్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.
రోహిత్‌, గిల్‌ మెరుపు శతకాలు
ఇండోర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఓపెనర్లు రోహిత్‌ శర్మ(101), శుభ్‌మన్‌ గిల్‌ (112) మెరుపు శతకాలతో విరుచుకుపడ్డారు. రోహిత్‌, గిల్‌ ఔటయ్యాక వడవడిగా వికెట్లు కోల్పోయిన భారత్‌.. ఆఖర్లో హార్ధిక్‌ పాండ్యా, శార్ధూల్‌ ఠాకూర్‌ (25) బ్యాట్‌ రaులిపించడంతో 375 పరుగుల మార్కు దాటింది. రోహిత్‌-గిల్‌ క్రీజ్‌లో ఉండగా.. ఓ దశలో టీమిండియా 400 పరుగుల మైలురాయిని సునాయాసంగా దాటుతుందని అంతా భావించారు. అయితే వరుస ఓవర్లలో వీరిద్దరు ఔట్‌ కావడం, ఆతర్వాత వచ్చిన కోహ్లి (27 బంతుల్లో 36` 3 ఫోర్లు, సిక్స్‌) కొద్ది సేపు మెరుపులు మెరిపించినప్పటికీ భారీ స్కోర్‌ చేయలేకపోయింది. ఇషాన్‌ కిషన్‌ (17)సూర్యకుమార్‌ యాదవ్‌ (14), వాషింగ్టన్‌ సుందర్‌ (9) నిరాశపరిచారు. కివీస్‌ బౌలర్లలో టిక్నర్‌, డఫ్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img