Friday, April 26, 2024
Friday, April 26, 2024

13 ఏళ్లకే పసిడి పట్టేసింది

చరిత్ర సృష్టించిన జపాన్‌ బాలిక

టోక్యో : ఒలింపిక్స్‌లో అత్యంత పిన్న వయసులో వ్యక్తిగత పతకం గెలిచిన క్రీడాకారిణిగా జపాన్‌ బాలిక మోమిజి నిషియా చరిత్ర సృష్టించింది. అరంగేట్ర మహిళల స్ట్రీట్‌ స్కేట్‌బోర్డింగ్‌లో నిషియా బంగారు పతకం గెలుచుకుని ఔరా అనిపించింది. ప్రస్తుతం నిషియా వయసు 13 ఏళ్ల 330 రోజులు కాగా ఈ ఆటలో ఫైనల్‌ చేరిన అమ్మాయిల సగటు వయసు కూడా దాదాపు 13-14 ఏళ్లే ఉండటం విశేషం. స్ట్రీట్‌ స్కేట్‌ బోర్డింగ్‌లో రన్‌ , ట్రిక్‌ అనే రెండు విభాగాలుండగా ఇందులో పాల్గొనేవారికి రన్‌లో రెండు, ట్రిక్‌లో ఐదు అవకాశాలు ఇస్తారు. అన్నింటిలో వచ్చిన మార్కులను కలిపి స్కోర్‌ను నిర్ణయిస్తారు. నిషియా రన్‌లో 3.02, ట్రిక్‌లో 4.15, 4.66, 3.43 స్కోర్లు సాధించింది. రెండు అవకాశాల్లో విఫలమైంది. మొత్తంగా 15.26తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఈ ఈవెంట్‌లో జపాన్‌కే చెందిన మరో క్రీడాకారిణి నకయామా ఫనా (16) కాంస్య పతకం గెలుచుకుంది. 14.49తో ఆమె మూడో స్థానంలో నిలిచింది. బ్రెజిల్‌కు చెందిన లియాల్‌ రేసా 14.64తో రజతం అందుకుంది. ఆమె వయసు 13 ఏళ్ల 203 రోజులు. తలకు గాయమై, ఎముకలు విరిగి అత్యంత వేగంగా కోలుకున్న 13 ఏళ్ల బ్రిటన్‌ అమ్మాయి స్కై బ్రౌన్‌ ఫైనల్‌లో పాల్గొనలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img