Friday, April 26, 2024
Friday, April 26, 2024

పొలార్డ్‌ అరుదైన ఘనత

ట్రినిడాడ్‌: వెస్టిండీస్‌ మాజీ సారథి కీరన్‌ పొలార్డ్‌ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్‌ లో మరెవరికీ సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 600 టీ-20 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. ప్రస్తుతం ది హండ్రెడ్‌ టోర్నమెంట్‌లో ఆడుతున్న ఈ ఆల్‌రౌండర్‌… సోమవారం ఈ ఘనత సాధించాడు. ఈ లీగ్‌లో లండన్‌ స్పిరిట్స్‌ తరపున ఆడుతున్న పొలార్డ్‌, ఈ ఘనతను తనదైన శైలిలో ఆస్వాదించాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌పై 11 బంతుల్లోనే ఒక ఫోర్‌, 4 భారీ సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తన జట్టు 52 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో పొలార్డ్‌ ఇప్పటివరకు 600 టీ-20 మ్యాచ్‌ల్లో 11,723 పరుగులు సాధించాడు. సగటు 31.34. అత్యధిక వ్యక్తిగత స్కోరు 104. ఒక సెంచరీ సహా 56 అర్ధసెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి. బౌలింగ్‌లోనూ 309 వికెట్లు పడగొట్టడం విశేషం. అత్యుత్తమ బౌలింగ్‌ రికార్డు 15 పరుగులకు 4 వికెట్లు తీయడం. పొలార్డ్‌… వెస్టిండీస్‌ దేశీయ జట్టు ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌, బిగ్‌బాష్‌లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢాకా గ్లాడియేటర్స్‌, ఢాకా డైనమైట్స్‌, పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో కరాచీ కింగ్స్‌, ముల్తాన్‌ సుల్తాన్స్‌, పెషావర్‌ జల్మీ, కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. పొలార్డ్‌ తర్వాత వరుసగా విండీస్‌ మాజీ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావో(543), పాక్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌(472), క్రిస్‌ గేల్‌(463), రవి బొపారా(426) ఉన్నారు. వీరి వయసు దాదాపు 40కి చేరువలో ఉంది. మాలిక్‌ మినహా అంతా ఇప్పటికే జాతీయ జట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. వీరంతా మిగతా టోర్నీల్లో ఆడినా.. పొలార్డ్‌ కూడా ఆడుతున్నాడు కనుక ఇప్పట్లో పొలార్డ్‌ రికార్డును ఎవరూ అధిగమించే అవకాశాల్లేవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img