Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పదవ తరగతి పరీక్షా ఫలితాలలోవిజయ దుందుభి మోగించిన ప్రభుత్వ పాఠశాలలు

ఎంఈఓ లు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని, పట్టణములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, పురపాలక సంఘ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూల్, పాఠశాలలో పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మంచి మార్కులతో విజయదుంది మోగించిందని ఎంఈఓ లు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 21 పాఠశాలలో అధిక మార్కులు రావడం జరిగిందని పట్టణంలోని బిఎస్సార్ పురపాలక బాలుర ఉన్నత పాఠశాలలో సాగర్ అనే విద్యార్థికి 593/600 మార్కులు రావడం జరిగిందని పాఠశాల ఉత్తీర్ణతా శాతం 98.68 రావడం జరిగిందన్నారు. అదేవిధంగా ఎం జె పి రెసిడెన్షియల్ స్కూల్ లో 96.74 శాతము, కేజీబీవీ పాఠశాలలో 94.87 శాతము రావడం జరిగిందన్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో 9 పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని తెలిపారు. పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ లో వై. నిత్యశ్రీ 594/600 మార్కులు కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. తదుపరి ప్రియదర్శిని పాఠశాలలో ఎస్. దీక్షిత 594 మార్కులతో సాధించడం జరిగిందని తెలిపారు. ధర్మవరం మండలం యొక్క గ్రేడ్ 42 పాఠశాలలకు గాను 87.6 శాతము సాధించడం జరిగిందన్నారు. ప్రతిభ ఘనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు, ఇంతటి విజయానికి కృషిచేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు, ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ లకు, ప్రైవేట్ పాఠశాలల హెడ్మాస్టర్, కరెస్పాండెంట్లకు మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img