Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ప్రైవేట్ విద్యాసంస్థలకు వత్తాసు పలుకుతున్న ఎంఈఓ ని సస్పెండ్ చేయాలి..

ఏఐ ఎస్బి, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు
విశాలాంధ్ర ధర్మవరం;; అక్రమ అడ్మిషన్లకు పాల్పడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతున్న ఎంఈఓ ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ ఆర్డిఓ కార్యాలయంలో సంబంధిత అధికారికి వినతి పత్రాన్ని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్బి నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగార్జున ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ప్రైవేటు పాఠశాల యాజమాన్యం వారు విద్యా సంవత్సరం పూర్తి అవ్వకముందు, మా పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభయ్యాయి అని ప్రచారాలు చేయడం దారుణం అన్నారు. అంతేకాకుండా ప్రచారాల కొరకు ఆటో లాంటి వాహనాలను పెద్ద బ్యానర్ వేసుకొని స్టిక్కర్లతో ప్రచారాలు నిర్వహించడం తగదని తెలిపారు. ప్రభుత్వా నియమ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై, ఎంఈఓ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దాము, ఏఐఎస్బి జిల్లా నాయకులు జనార్దన్, యాసిన్, మధు, మురళి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img