Friday, April 26, 2024
Friday, April 26, 2024

మండలానికి రిపోర్టుచేసిన 1998 డి.ఎస్సీ ఉపాధ్యాయులు

విశాలాంధ్ర – సీతానగరం : 1998 డి.ఎస్సీ ద్వారా ఎంపికైన ఎనిమిది మంది ఉపాధ్యాయులు గురువారంనాడు మండల విద్యాశాఖాధికారి జి.సూరిదేముడును కలిసి జాయినింగ్ రిపోర్టు చేశారు. వారికి సంబందించి అన్ని ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను మండల విద్యాశాఖాధికారి క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతోపాటు వారివద్ద నుండి బాండ్ పేపర్ మీద నియమావళి మేరకు అగ్రిమెంట్ పత్రాన్ని కూడా తీసుకొని వారికి కేటాయించిన పాఠశాలల ఉత్తర్వులను అందజేసారు.డి.ఎస్సీ 98ద్వారా ఎంపికైన సిరికి మహేష్ కు అనంతరాయుడుపేట, పెంట మోహనరావుకు వెంకటపురం(ఏ), రెడ్డి భాస్కరరావుకు నీలకంఠపురం,
సిహెచ్ శ్రీనివాసరావుకు వెన్నెలబుచ్చెంపేట , ఎం.సత్యనారాయణకు వెంకటాపురం (ఎన్), ఆర్.అప్పలనాయుడుకు కాసాపేట, బలగ అప్పలనాయుడుకు చిన్నా రాయుడుపేట , టి.సూర్యప్రకాశరావుకు దయానిధిపురం పాటశాలలు కేటాయిస్తూ జిల్లా పరిషత్, జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో వారంతా గురువారం వారికి కేటాయించిన పాటశాలలో చేరినట్లు మండల విద్యాశాఖాధికారి చెప్పారు.25ఏళ్ల తరువాత ఉద్యోగాలు రావడంతో వారంతా ఎంతో ఆనందాన్ని వ్యక్తంచేశారు. తోటిఉపాధ్యాయులతో కలిసి మెలిసి విధ్యార్థులకు మెరుగైన విద్యా సేవలు అందించేందుకు పాఠ్యపుస్తకాలు చదివి పాఠ్య ప్రణాళిక బద్ధంగా చదువులు చెప్పేందుకు కృషి చేస్తామని కొత్తగా నియమించబడిన ఉపాధ్యాయ సిబ్బంది తెలిపారు. మండలానికి విచ్చేసిన ఎనిమిదిమందిలో ఈ మండలానికి చెందిన వారే నలుగురు ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా కొత్తగా చేరిన ఎనిమిది మంది ఉపాధ్యాయులకు ఏపీటిఎఫ్ నాయకులు మరడాన శివున్నాయుడు, దాసరి వెంకట నాయుడు, చుక్క శ్రీదేవి,సత్యనారాయణ పిఆర్టియునేత వోలేటి తవిటి నాయుడు తదితరులు అభినందించారు. సిఆర్పిలు అనసూయ, రమేష్లు, కార్యాలయ సిబ్బంది కూడా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img