Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వృద్ధులకు హెల్ప్ లైన్ 14567

గోడ పత్రికను ఆవిష్కరించిన ఎస్పీ జి అర్ రాధిక

విశాలాంధ్ర – శ్రీకాకుళం : జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ 14567 పోస్టర్ ను జిల్లా సూపర్ ఇంటెండెంట్ ఆఫ్ పోలీస్ జి.ఆర్ రాధిక శనివారం ఆవిష్కరించారు. వృద్ధాశ్రమాలు, సంరక్షణ కేంద్రాలు, కార్యాచరణ కేంద్రాలు, ఆసుపత్రులు తదితర వివరాల కోసం, పెన్షన్, చట్టపరమైన సమస్యలపై సలహాలు సూచనలకు కోసం,భావోద్వేగమైన విషయాలను హెల్ప్ లైన్ తో పంచుకోవడం కోసం “ఎల్డర్ లైన్ అందుబాటులో ఉందని తెలిపారు. వృద్ధులను హింసించినా, ఇంటి నుండి బయటకు గెంటి వేయబడిన హెల్ప్ లైన్ తెలియపరచాలాని తెలిపారు.జిల్లా పోలీసు ఎంత్రాంగాని మరియు సచివాలయం మహిళా పోలీసులు ఈ హెల్ప్ లైన్ సేవలను ప్రజలకు తెలియపరిచేలా చేయాలనీ సూచించారు అలాగే వృద్దులు, తల్లి తండ్రులు ఈ హెల్ప్ లైన్ 14567 ను వినియోగించుకోవాలని జిల్లా ఎస్ పి జి ఆర్ రాధికా గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ సూపర్ఇంటెండెంట్ ఆఫ్ పోలీస్ కె. శ్రీనివాసరావు , ఐ సి పి ఎస్ నుండి కె వి రమణ, జిల్లా జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ టి.తిరుపతి రావు, సి డబ్ల్యూ సి నుండి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img