Friday, April 26, 2024
Friday, April 26, 2024

స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని అలవర్చుకోవాలి

ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరాలి : జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక

విశాలాంధ్ర -శ్రీ‌కాకుళం: భారతదేశ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక పిలుపునిచ్చారు.దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్త‌యిన వేళ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు మేరకు నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ జి ఆర్ రాధిక గురువారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.ఈ ర్యాలీ అర్ట్స్ కళాశాల వద్ద ప్రారంభమై డే అండ్ నైట్, సూర్య మ‌హ‌ల్ కూడ‌లి, వైఎస్సార్ కూడ‌లి (ఏడు రోడ్ల జంక్ష‌న్),ఎన్. టి. ఆర్ మైదానం వ‌ర‌కూ 30 మీటర్లు తివ్రర్ణ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తు దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్త‌యిన వేళ నాటి సంగ్రామ కాలాన్ని, నాటి వీరుల స్ఫూర్తిని త‌లుచుకుంటూ జాతీయ సమైక్యత, మతసామరస్యం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా సాగింది. అనంతరం ఎన్టీఆర్ మైదానంలో మానవహారం గా ఏర్పడి జాతీయ జాతీయ సమైక్యత ప్రదర్శించారు.
ఈ సంద‌ర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్త‌యిన వేళ ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు రెండు మైలు నడక ర్యాలీని నిర్వ‌హించ‌డం జరిగింది అని తెలిపారు. ఈ ర్యాలీలో జిల్లా పోలీస్ సిబ్బంది, ఆర్మడ్ రిజర్వ్ పోలీస్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, హోమ్ గార్డ్స్ తో పాటు ఎన్. సి. సి,ఎన్ఎస్ఎస్ స్కౌట్ అండ్ గౌడ్స్, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ పెద్ద పండగ భావించి వేడుకగా నిర్వహించాలన్నారు.
రానున్న స్వాతంత్ర దినోత్సవం వరకు ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరేసి జాతీయ సమైక్యతకు సూచిక నిలవాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాసరచన పోటీలు ఇతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు.ఆనాటి
వీరుల త్యాగాల‌ను త‌ల్చుకుంటూ నాటి విముక్త పోరాటంలో యోధుల స్ఫూర్తిని, వారిని మ‌రోసారి స్మ‌రించుకుంటూ సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని గౌరవించవలసిన బాధ్యత అంద‌రి పైన వుంది అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలనిన్నారు.ఈ ర్యాలీ ఇంత విజయవంతంగా జరగడం ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎస్పీ తెలియజేశారు. అనంతరం పోలీస్ కళాజాత బృందం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కె. శ్రీనివాసరావు, టీపి విటలేశ్వరరావు, డీఎస్పీలు ఎం మహేంద్ర, ప్రసాదరావు, సిఐలు వెంకటేశ్వర్లు, అంబేద్కర్, ఈశ్వర్ ప్రసాద్ శ్రీనివాసరావు,పోలీసు సిబ్బంది,ఎన్.సి. సి,ఎన్ఎస్ఎస్, స్కౌట్ అండ్ గౌడ్స్, విద్యార్థులు
తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img