Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

75వస్వాతంత్ర్య దినోత్సవవేడుకలకు సిద్దమవుతున్న పార్వతీపురం మన్యం జిల్లా

విశాలాంధ్ర,పార్వతీపురం : పార్వతీపురం మన్యంజిల్లా ఏర్పడినతరువాత మొదటి సారిగా నిర్వహిస్తున్న 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైనది.  పార్వతీపురం మన్యంజిల్లాలో మొట్ట మొదటి స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్న తరుణంలో ఘనంగా నిర్వహించుటకు ఆన్నిశాఖలఅధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.పార్వతీపురం డి.ఎస్.పి సుభాష్ పెరేడ్ కమాండరుగా పోలీస్ శాఖ పెరేడ్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులను కూడా  భాగస్వాములుగాచేసి రిహార్సల్ చేస్తున్నారు.జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే ఈఉత్సవాలకు ఆర్ అండ్ బి, గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ అధికారులు మైదానం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లావిద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుటకు సిద్ధం అవుతున్నారు.జిల్లాలోని వివిధశాఖలు తమ ప్రగతిని తెలియజేస్తూ శఖటాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్ శుక్రవారంనాడు ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేశారు. సంబంధిత అధికారులకు తగుఆదేశాలు జారీచేస్తూ అన్నిఏర్పాట్లు సక్రమంగా చేయాలన్నారు.
ఈకార్యక్రమంలో డి.ఎస్.పి. ఏ.సుభాష్, జిల్లా పరిశ్రమల అధికారి సీతారామ్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img