Friday, April 26, 2024
Friday, April 26, 2024

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

73.54 శాతం పోలింగ్ నమోదు
13వేల 619మంది ఓట్లు నమోదు

విశాలాంధ్ర,పార్వతీపురం : జిల్లాలో సోమవారం జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సభ్యుల ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. 73.54శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వేసినట్లు జిల్లా ఎన్నికల అధికారులు చెప్పారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ , జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుల నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, డి ఎస్పీలు సుభాష్, నాగేశ్వరరావు, కృష్ణారావు, తదితర జిల్లా అధికారులు విస్తృతంగా పర్యవేక్షణ చేసి ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు.ఐదుగురు సెక్టార్ అధికారులు తమపరిధిలో విస్తృతంగా పర్యటించిఎప్పటికప్పుడు నివేదికలు అందజేసారు.జిల్లాలో 18,520 మంది ఓటర్లకు 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 18వేల 520 మంది పట్టభద్రులు ఓట్లు నమోదు చేసుకోగా సోమవారం జరిగిన ఎన్నికలలో 13వేల 619మంది ఓటును సద్వినియోగం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.జిల్లా యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. వివిధ వర్గాల పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. అన్నిశాఖల సమన్వయంతో జిల్లాలో మొదటి సారిగా జరిగిన ఎన్నికలను ప్రశాంతంగా జరిగాయి.ముందస్తు ప్రణాళికతో పకడ్బందీగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img