Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విశాలాంధ్ర వార్తకు స్పందన

అటవీఉత్పత్తులు కొనుగోలు వేగవంతం చేస్తాం:జిసిసి డిఎం మహేంద్ర

విశాలాంధ్ర,కురుపాం/పార్వతీపురం : ఏజెన్సీ ప్రాంతంలో జిసిసి ద్వారా అటవీ ఉత్పత్తులు కొనుగోలు వేగవంతం చేస్తున్నట్లు పా‌ర్వతీపురం డివిజనల్ మేనేజర్ మహేంద్ర తెలిపారు. సోమవారంనాడు విశాలాంధ్రలో ప్రచురించిన “గిట్టుబాటుకు గ్రహపాటు ” కథనంపై స్పందించిన ఆయన మాట్లాడుతూ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో చింత పండు కొనుగోలు కేంద్రాలు ద్వారా కొనుగోలు ముమ్మరం చేసామని తెలిపారు. గ్రేడ్ 1 రకం చింత పండు రూ.32.40 కు కొనుగోలు చేస్తున్నామన్నారు. పిక్క తీసిన చింత పండు రూ 65/- మిగిలిన అన్ని రకాల అటవీ ఉత్పత్తులు కొనుగోలు కోసం ఇటీవల నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కోసం గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు.గిరిజన రైతులు అటవీ ఉత్పత్తులు జిసిసి కొనుగోలు కేంద్రం లకు సరుకులు తీసుకుని వచ్చి గిట్టుబాటు ధరలు పొందాలని సూచించారు.జిసిసి పూర్వ వైభవం తిరిగి తీసుకుని వచ్చేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ,ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ద్వారా సమస్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ద్రుష్టి కి తీసుకుని రావటం జరిగిందని తెలిపారు.
రైతులు నాణ్యమైన సరకులు తీసుకుని వచ్చి గిట్టుబాటు ధరలు పొందాలి:
గిరిజన ప్రాంతాల్లో రైతులు నాణ్యమైన చింత పండు ,జీడిపిక్కలు ,ఇండుగ పిక్కలు ,కరక్కాయ ,కొండతామర జిగురు, కొండచీపురు ,తేనె లను తీసుకుని వచ్చి జిసిసి నిర్వహించిన గిట్టుబాటు ధరలు పొందాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో చింత పండు తడిపి తీసుకుని రావడం వలన నిల్వలు కు పనికిరాని విధంగా తయారౌతుందని ఫలితంగా నష్టం వాటిల్లిందని తెలిపారు. గిరిజన సంఘాలు విద్యావంతులైన యువత మహిళలు ,రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈఏడాది అటవీ ఉత్పత్తి లు కొనుగోలు ధరలు విడుదల చేసారు.
జిసిసిని వేధిస్తున్న సిబ్బంది కొరత:
దశాబ్ద కాలంలో సిబ్బంది నియామకాలు జిసిసి చేపట్ట నందున ఉన్న అరకొర సిబ్బంది తోనే అన్ని పనులు చేస్తున్నామని తెలిపారు.సిబ్బంది నియామకాలు చేపడితే పనివత్తిడి లేకుండా మరింత ఉత్సాహంగా పనిచేయించే అవకాశం ఉంటుందన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img