Friday, April 26, 2024
Friday, April 26, 2024

డ్రోన్లతో బగ్గందొరవలస గ్రామంలోరీసర్వే

విశాలాంధ్ర, సీతానగరం:మండలములోని బగ్గందొరవలస గ్రామంలో శనివారం నాడు డ్రోన్లతో రీసర్వే నిర్వహించారు.జిల్లా కలెక్టరు నిషాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆనంద్, సబ్ కలెక్టర్ భావన ఆదేశాలుమేరకు వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పధకంక్రింద ఎంపిక చేసిన ఎనిమిది గ్రామాల్లో రీసర్వే ముమ్మరంగా జరుగుతున్నదని, ఐదుగ్రామాల్లో రీసర్వే పూర్తి జరిగిందనితహశీల్దార్ ఎన్వీ రమణ తెలిపారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బందికి సూచనలు ఇస్తూ వేగవంతంగా పూర్తిచేయాలని కోరుతున్నట్లు చెప్పారు. పలు గ్రామాల్లో రీసర్వేపనులు జరుగుతున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆయాగ్రామాలలో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామసర్వేయర్లుతో పాటు విఆర్ఏలు ఆయాగ్రామాలలో ఉండి త్వరితగతిన పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆయనతోపాటు డిప్యూటీ తహశీల్దార్ షేక్ ఇబ్రహీం,మండల రెవెన్యూ పర్యవేక్షకుడు రాజేష్, మండలసర్వేయర్,సర్పంచులు నారాయణరావు, నడిమింటి రామక్రిష్ణ, విఆర్ఓలు, గ్రామసర్వేయర్లు,రైతులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రోవర్లు కొరత కారణంగా జిల్లా అధికారుల లక్ష్యాలను చేరుకోలేక పోతున్నామని సిబ్బంది వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం మండలములోని అన్ని బి ఎల్ ఓలలో ఓటుహక్కుకు ఆధార్ అనుసంధాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఓటు హక్కు గలిగిన ప్రతీ ఒక్కరు తమ ఆధార్ కార్డు ప్రతిని ఇచ్చి అనుసంధానం చేసుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img