Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా, క్రీడా దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర,సీతానగరం: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషాదినోత్సవం, క్రీడాదినోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులకు పద్యపోటీలు , వ్యాసరచన ,  వకృత్వా పోటీలు నిర్వహించి గిడుగు రామమూర్తి సేవలను తెలుగుభాషాకు ఆయన చేసిన సేవలను కొనియాడారు.  అలాగే క్రీడాదినోత్సవం సందర్భంగా విద్యార్థులకు రకరకాల ఆటలపోటీలు నిర్వహించారు. క్రీడాస్ఫూర్తిని నింపిన ధ్యాన చంద్ సేవలను కొనియాడారు.
ఈకార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాద్యాయులు ఇళ్లా ప్రసన్న లక్ష్మి గారు స్టాఫ్ సెక్రెటరీ, జిల్లా పిఆర్టియు ప్రెసిడెంటు వాలేటి తవిటినాయుడు, తెలుగుభాషా ఉపాధ్యాయులు పైడిరాజు, సుభద్రమ్మ, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు తదితర ఉపాధ్యాయులు,విధ్యార్ధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img