Monday, September 26, 2022
Monday, September 26, 2022

అభివృద్ధి పనుల సకాలంలో నివేదికలు అప్ లోడ్ చేయాలి

విశాలాంధ్ర పార్వతీపురం: అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ కమీషనర్ కోన శశిధర్ ఆదేశించారు. పంచాయతీరాజ్ అంశాలపై కమీషనర్ జిల్లా కలెక్టరులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుభరోసా కేంద్రాలు, సచివాలయాలు తదితర భవనాలనిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు. సిమెంట్ ఇతర బిల్లులు సకాలంలో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాకలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. మండల అధికారులతో తరచూ పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. ఇటీవల వర్షాలు, వాతావరణ పరిస్థితుల రీత్యా పనుల్లో కొంత జాప్యం జరిగిందని ఆయన అన్నారు.
ఈవీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.రామచంద్ర రావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.జి.కృష్ణాజి, జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారి ఓ.ప్రభాకరరావులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img