Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌ జిల్లా దవాఖానలో దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను మంత్రి సత్యవతి రాథోడ్‌ మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహబూబాబాద్‌ హాస్పిటల్‌ దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. ములుగు, జయశంకర్‌ జిల్లా, తోర్రురులో కూడా వైద్య సదుపాయాలు, హాస్పిటల్‌ కోసం ఆక్స్‌ ఫామ్‌ సంస్థ నిధులు ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్‌ కాలేజీ వల్ల ఎవరికి అన్యాయం జరుగకుండా ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. మెడికల్‌ కాలేజి కోసం ఎంపిక చేసిన స్థలంలో అర్హులైన పేదలు నష్టపోతే వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ జిల్లా అభివృద్ధిలో జిల్లా నాయకత్వం అంతా కలిసి పని చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ కుమారి బిందు, ఎంపీ కవిత, మున్సిపల్‌ చైర్మన్‌ రామ్మోహన్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఫరీద్‌, కలెక్టర్‌ శశాంక, అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకట్రాములు, ఆక్స్‌ ఫామ్‌ సంస్థ ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img