Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

ఆర్ధిక వ్యవస్ధ పురోగతికి సీఎం కృషి : తలసాని

రూ. 115 కోట్లతో చేప పిల్లల ఇచ్చే స్థాయికి వస్తామని కలలో కూడా ఊహించలేదని, కరెంటు, నీళ్లు ఈ విధంగా వస్తాయని రైతులు ఊహించలేదని, 66 వేల మందికి టూ వీలర్‌, ఇతర వాహనాలు, పనిముట్లు ఇచ్చామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని సింగపూర్‌లో గల ఊర చెరువులో, బేతిగల్‌ ఊర చెరువులో, జమ్మికుంటలోని గుండ్ల చెరువుల్లో సోమవారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేప పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఆర్ధిక వ్యవస్ధ పురోగతికి సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు కుల వృత్తుల వారిని ఓటు బ్యాంకుగా చూశారుసీఎం కేసీఆర్‌ ఎంతో ఆలోచించి కుల వృత్తులపై ఆధారపడ్డ వాళ్ళను బలోపేతం చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ నీటిపై హక్కు మత్స్యకారులకే ఉండాలని జీవో ఇచ్చారు.మార్కెటింగ్‌ సౌకర్యాలు పెరగడానికి కూడా స్టడి చేస్తున్నాం.ఇక్కడి చేపలను ఎగుమతి చేసే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు సతీష్‌ బాబు, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌ పర్సన్‌ కనుమళ్ల విజయ, మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, జిల్లా ఫిషరీస్‌ సోసైటీ మాజీ చైర్మన్‌ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img