Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఇళ్ల నుంచి బయటకు రావొద్దు, ఆ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి

సీఎం కేసీఆర్‌ ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున అత్యవసరమైతే తప్ప, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, పొంగిపొర్లే వాగులు, వంకలు దాటకూడదని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర ప్రాంతాల్లో సేవలందించాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని ఆదేశించించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో సేవలందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సెలవులు తీసుకోకుండా ఉద్యోగులు విధులు నిర్వహించాలన్నారు.
హెలిప్యాడ్లను సిద్ధం చేయండి..
మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రాజెక్టులు వరద ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ అప్రమత్తంగా ఉండేలా సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కడెం, భైంసా ఉట్నూర్‌ ఆసిఫాబాద్‌ మంచిర్యాల తదితర ప్రాంతాల్లో హెలిప్యాడ్లను సిద్ధం చేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి సీఎం కేసీఆర్‌ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img