Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

కేసులు ఉపసంహరించుకోవాలి..

విశాలాంధ్ర`హైదరాబాద్‌ : మహిళా నాయకులపై వెంటనే కేసులు ఎత్తివేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఎన్‌ఎఫ్‌ఐ డబ్ల్యూ జాతీయ ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ రజని హెచ్చరించారు. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న మహి ళలపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్‌ రావు చేసిన వ్యాఖ్యలు, మరి యమ్మ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఏఎన్‌ఎంలు చేస్తు న్న పోరాటానికి మద్దతుగా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నడుపుతున్న కమలా నెహ్రూ పాలిటెక్నిక్‌ కాలేజీని మూసివేయాలని నిర్ణయాన్ని రద్దు చేయాలనే డిమాండ్లతో ఆదివారం రాజ్‌ బహదూర్‌ గౌర్‌ హాల్లో ఉస్టెల సృజన అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్‌ రజని మాట్లా డుతూ.. పర్యావరణం దెబ్బ తింటుందని ఉద్యమ కారులపై కేసులు పెట్టడం అవివేకమని తప్పు బట్టారు. వినాయక నిమజ్జనం వల్ల కర్మాగారాల నుంచి వచ్చిన కాలుష్యం వల్ల హుస్సేన్‌ సాగర్‌ కలుషితం కావడం లేదా కేవలం సిలిండర్‌ వేసి నంత మాత్రాన పర్యావరణానికి దెబ్బ వచ్చిందా అని ప్రశ్నించారు. ఎర్రబెల్లి దయాకర్‌ రావు విచక్షణా రహితంగా మాట్లాడడాన్ని ఖండిస్తూ ఎంపీడీవోకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పీవోడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య మాట్లాడుతూ.. ధరలను అదుపు చేయలేని చేతగాని ప్రభుత్వాలు, గ్యాస్‌ ధరలు పెంచుతుంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేని చేతగాని ప్రభుత్వాలు నిరసన తెలిపిన మహిళలపై ప్రతాపం చూపడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. వెంటనే అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త కాదని మంత్రుల స్థాయిలో ఉన్న నాయకులు మహిళల పట్ల కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని వీరికి అధికారం బలుపు తలకు ఎక్కిందని మహిళలందరూ కలసి దించుతారని హెచ్చరించారు. మరియమ్మను లాకప్‌ డెత్‌ చేసిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. సామాజిక కార్యకర్త దేవి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై సామాన్య ప్రజ లపై పెట్రో, నిత్యావసర వస్తువుల ధరలను పెంచు తూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఇదేమిటని ప్రశ్నిస్తే కేసుల పేరుతో అణచివేస్తున్నారని విమర్శిం చారు. వెంటనే మహిళా నాయకులపై పెట్టిన కేసు లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. శ్రామిక మహిళా ఫోరం నాయకురాలు ప్రేమ్‌ పావని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నా చౌక్‌ ఎత్తి వేసిన ఘనత టీఆర్‌ఎస్‌ దేనని, పోలీసుల రాజ్యంతో నిరసనకారులపై అక్ర మ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, ఇలాంటి బెది రింపులకు భయపడేది లేదని హెచ్చరించారు. టీడీపీ నాయకురాలు జోష్ణ మాట్లాడుతూ.. దిక్కార స్వరాన్ని వినిపించే హక్కును కూడా కాలరాస్తున్నారని ఇలాం టి నిరంకుశ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెబుతా రని హెచ్చరించారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి మాట్లాడుతూ.. ఎన్ని కేసులు పెట్టుకున్నా ఉద్య మాలను ఆపేది లేదని, నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాబో యే కాలంలో మహిళలు గోరి కడతారని హెచ్చరిం చారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కృష్ణ కుమారి మాట్లాడుతూ.. మరియమ్మ కుటుంబానికి నష్ట పరిహారం చెల్లిస్తే చేసిన నేరం మాఫీ అవుతుందా అని ప్రశ్నించారు. వెంటనే సంబంధిత పోలీసులపై హత్యానేరం కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఎర్రబెల్లి దయాకర్‌ రావు వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రచయిత్రి బండారు విజయ యూత్‌ ఫెమినిస్టు వర్షా భార్గవి, మహిళా సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శులు జె.లక్ష్మి, గ్యార యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img