Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది

తమిళిసై సౌందర్‌ రాజన్‌
తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌ రాజన్‌ నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన విధుల నిర్వహణ, అనుభవాలపై ఆమె ఓ పుస్తకం విడుదల చేశారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగించారు. గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని, తనకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్‌తో సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. వరదలు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం పనితీరు బాగుందని ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణతో పాటు పలువురు సీనియర్‌ జర్నలిస్టులు, రాజ్‌భవన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img