Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

త్వరలో ఎయిర్‌ పోర్టులో రెండో రన్‌ వే.. సీఎం కేసీఆర్‌

త్వరలోనే శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో రెండో రన్‌ వే రాబోతోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మెట్రో సెకండ్‌ ఫేజ్‌ కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా పోలీసు అకాడమీ గ్రౌండ్‌ లో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, హైదరాబాద్‌ మెట్రోలో ప్రతిరోజూ 4.5లక్షల మంది ప్రయాణిస్తున్నారన్నారు. ఎయిర్‌ పోర్టు మెట్రో అందుబాటులోకి వస్తే మరో 80వేల మంది ప్రయాణీకులు పెరిగే అవకాశముందన్నారు. భవిష్యత్‌ లో ఔటర్‌ రింగురోడ్డు చుట్టూ మెట్రో రావాల్సిన అవసరముందన్నారు. వరల్డ్‌ గ్రీన్‌ సిటీ బెస్ట్‌, లివబుల్‌ సిటీ అవార్డులు హైదరాబాద్‌ సొంతం చేసుకుందన్నారు. హైదరాబాద్‌ కు ప్రతియేటా వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img