Friday, October 7, 2022
Friday, October 7, 2022

నటుడు కృష్ణుడు అరెస్టు

ప్రముఖ సినీ నటుడు కృష్ణుడు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కాడు. శుక్రవారం అర్థరాత్రి మియపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శిల్పాపార్క్‌ విల్లాలో పేకాట ఆడుతున్నారన్న విషయం తెలుసుకున్న ఎస్‌ఓటీ మాదాపూర్‌ పోలీసులు శిబిరంపై దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న నటుడు కృష్ణుడు సహా 8 మందిని అరెస్టు చేశారు. వీరిని మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సొంత పూచికత్తుపై నిందితులను పోలీసులు నిన్న రాత్రి ఇళ్లకు పంపించి వేశారు. ఇవాళ సాయంత్రం విచారణకు రావాలని వారిని ఆదేశించారు.కృష్ణుడు ‘వినాయకుడు’తో పాటు పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img