నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో 52,384 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా…ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉండగా…ప్రస్తుతం నీటి నిలువ 310.2522 టీఎంసీలు ఉంది.