Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న పెయింట్‌, రసాయన పరిశ్రమల్లో శనివారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ముందుగా పెయింట్‌ పరిశ్రమలోకి మంటలు వచ్చాయి. పరిశ్రమలోని కెమికల్‌ డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. మంటలు రసాయన పరిశ్రమ అంతటికీ వ్యాపించడంతో యంత్రాలు తగలబడ్డాయి. దీంతో కంపెనీలో పని చేసే సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. చుట్టుప్రక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img