Monday, August 8, 2022
Monday, August 8, 2022

బషీర్‌బాగ్‌ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ నిరసన

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తున్న నేపథ్యంలో ెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఈ ర్యాలీలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో పాటు వెయ్యి మంది నేతలు, కార్యకర్తలు పాల్గొనేందుకు పోలీసులు అనుమతిచ్చారు. ఢల్లీిలోని ఈడీ కార్యాలయం నుంచి రాహుల్‌ బయటకు వచ్చే వరకు శాంతియుతంగా నిరసన తెలపాలని తెలంగాణ కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ క్రమంలో టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ నిరసన ర్యాలీ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్దకు చేరింది. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ నేతలు బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ నిరసన ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు ఆ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.ర్యాలీ నేపథ్యంలో నగరంలో పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్‌ కూడలి, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, చింతల్‌ బస్తీ, లక్డీకాపూల్‌, బషీర్‌బాగ్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ చౌరస్తా, అంబేద్కర్‌ విగ్రహం, ఎన్టీఆర్‌ మార్గ్‌, లిబర్టీ జంక్షన్‌, సెక్రటేరియెట్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సాయంత్రం 3 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. ఇటు పలు చోట్ల వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img