Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.. రైల్వే జీఎంకు ఎమ్మేల్యే వినతి

రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్‌ రెడ్డి శుక్రవారం దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ను కోరారు. సికింద్రాబాద్‌ నుండి రామగుండం వైపు వెళ్తున్న జీఎం పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి జీఎంకు స్వాగతం పలికారు. పెద్దపల్లి, పొత్కపల్లి రైల్వే స్టేషన్లలో నెలకొన్న సమస్యలను జీఎంకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్దపల్లిలో హైదరాబాద్‌ టు నాగ్‌ పూర్‌, నవజీవన్‌ ఎక్స్ప్రెస్‌, దక్షన్‌, కేరళ వంటి రైళ్ళను ఆపాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img