లఖీంపూర్ ఖేరీ ఘటనను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తీవ్రంగా ఖండిరచారు. యూపీలోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీద నుంచి కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.‘‘ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ఖేరిలో రైతుల నిర్దాక్షిణ్యమైన, కోల్డ్ బ్లడెడ్ మర్డర్ను చూసి షాక్, భయం వేసింది. ఈ అనాగరిక సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.