Friday, April 26, 2024
Friday, April 26, 2024

పంచాయితీ అంతా నా మధ్య, రేవంత్‌ రెడ్డి మధ్యనే : జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ అంతా నా మధ్య, రేవంత్‌ రెడ్డి మధ్యనే. పార్టీలో కాదు అని జగ్గారెడ్డి తేల్చిచెప్పారు. మా ఇద్దరి గుణగణాలకు సంబంధించిన పంచాయితీ ఇది అని తెలిపారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో ఉండాలనే అనుకుంటున్నానని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్‌ నాయకత్వాన్ని సమర్థిస్తున్నానన్నారు. కాంగ్రెస్‌లోనే తప్పొప్పులు మాట్లాడేకునే వీలుంటుందని, పదవులు కోత అనేది స్పోర్టివ్‌గా తీసుకుంటానన్నారు. రాజకీయంగా సీఎం కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. దేశానికి కాంగ్రెస్‌తోనే మేలు జరుగుతుందన్నారు. అయితే తన పంచాయితీ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితోనే అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రేవంత్‌ రెడ్డితో కలిసి పని చేసేందుకు తనకు అభ్యంతరం లేదని చాలా సార్లు చెప్పాను. ఆ కుర్చీ మీద చూసేది రేవంత్‌ ను కాదు.. రాహుల్‌ ని, సోనియాను అని అనేక సార్లు చెప్పాను. కానీ నా మీద సోషల్‌ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారు. నేను రెండు, మూడు సార్లు కండువా మార్చుకున్నాను. కానీ శ్రీధర్‌ బాబు, భట్టి విక్రమార్క, వీహెచ్‌ మీద టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి ప్రచారం చేయడం సరికాదు. . రేవంత్‌ రెడ్డి తనకు రaలక్‌ ఇవ్వడం కాదు.. తానే ఆయనకు రaలక్‌ ఇస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. జగ్గారెడ్డి ధైర్యాన్ని ప్రశ్నించే నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నారా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. మున్ముందు రేవంత్‌ అసలు స్వరూపం బయట పెడుతానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img