Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఆకర్షణీయమైన పెట్టుబడులకు కేంద్రంగా జీనోమ్‌ వ్యాలీ : కేటీఆర్‌

అన్ని రకాలుగా ఫార్మా సంస్థలకు జీనోమ్‌ వ్యాలీ అనువుగా ఉంటుందని, యూనిట్ల స్థాపనకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆకర్షణీయమైన పెట్టుబడులకు జీనోమ్‌ వ్యాలీ కేంద్రంగా మారిందని అన్నారు. మంగళవారం జీనోమ్‌ వ్యాలీలో కేటీఆర్‌ జాంప్‌ ఫార్మాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కెనడా తర్వాత హైదరాబాద్‌లో జాంప్‌ హైదరాబాద్‌లోనే పెద్ద బ్రాంచ్‌ను ప్రారంభించిందని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌ను పరిశీలించిన అనంతరం.. కంపెనీ హైదరాబాద్‌ను ఎంచుకుందన్న మంత్రి.. ఈ సందర్భంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. కంపెనీల విస్తరణకు హైదరాబాద్‌లో అపార అవకాశాలున్నాయని తెలిపారు. గుజరాత్‌ పారిశ్రామికవేత్తలు అహ్మదాబాద్‌ కంటే హైదరాబాద్‌నే ఇష్టపడుతున్నారన్నారు. గ్లోబల్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ వాటా 33శాతం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అద్భుతమైన సహకారం అందిస్తుందన్నారు. 28 రోజుల్లోనే జాంప్‌ ఫార్మాకు భూమిని కేటాయించామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బీ-హబ్‌ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిందని తెలిపారు. బీ-హబ్‌ నిర్మాణంతో పాటు జీనోమ్‌ వ్యాలీ అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img