Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంటే ‘రాష్ట్ర రోడ్డు రవాణా’ అంటూ…


టీఎస్‌ఆర్టీసీకి అదిరిపోయే పబ్లిసిటీ..

తెలంగాణ ఆర్టీసీ సంస్థ ట్రెండ్‌కు తగ్గట్లుగా ముందుకు పోతోంది. మూస పద్ధతిలో అవగాహన కార్యక్రమాలు, ప్రకటనలు ఇవ్వడం ఎప్పుడో మానేసి నవతరం అభిరుచులకు అనుగుణంగా ప్రచార చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. యువతలో బాగా క్రేజ్‌ ఉన్న సినిమానో, లేదా నటుడినో లేదా అంశాన్నో ప్రచారాస్త్రంగా వాడేస్తోంది. ఆర్టీసీకి ఎండీగా సజ్జనార్‌ నియామకం జరిగినప్పటి నుంచి ఈ ప్రచారాల పంథా పూర్తిగా మారిపోయింది. టీఎస్‌ఆర్టీసీని ఎలాగైనా లాభాల బాట పట్టించాలని కంకణం కట్టుకున్న సజ్జనార్‌ ఆ దిశగా ప్రచార వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి తాజాగా విడుదలైన ‘ఎత్తర జెండా’ పాటను ఎంచుకున్నారు. ఆ పాటను టీఎస్‌ఆర్టీసీకి అన్వయిస్తూ.. పబ్లిసిటీ చేశారు. అసలు టైటిల్‌ అర్థాన్నే మార్చేసి ఆర్టీసికి అదిరిపోయే పబ్లిసిటీ తెచ్చేశారు.అంటే ‘రాష్ట్ర రోడ్డు రవాణా’ అంటూ సరికొత్త అర్థాన్ని ఇచ్చారు.‘ నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ అనే పాట సమయంలో పైకి ఎత్తే జెండాపై ‘వందేమాతరం’ అని ఉంటుంది. కానీ సజ్జనార్‌ చేసిన ట్వీట్‌లో ప్రచార చిత్రంలో మాత్రం ‘వందేమాతరం’ స్థానంలో టీఎస్‌ఆర్టీసీ లోగో, బస్సు గుర్తులు ఉన్నాయి. ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మొన్నటికి మొన్న ‘పుష్ప’ సినిమాను, నిన్న రాధేశ్యామ్‌ సినిమాను కూడా టీఎస్‌ఆర్టీసీ పబ్లిసిటీకి ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img