Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఈ అభివృద్ధి వెనకాల ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి పాత్ర ఉంది : మంత్రి కేటీఆర్‌

దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఇది ఒకరిద్దరివాళ్ళ సాధ్యపడలేదు.ఈ అభివృద్ధి వెనకాల ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి పాత్ర ఉంది అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తెలిపారు. సోమవారం సోమజిగూడలోని పార్క్‌ హోటల్‌ లో పరిశ్రమలు,వాణిజ్య శాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో భాగంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌,ఎలక్ట్రిక్‌ వేహికల్స్‌ కి సంబంధించిన వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్నది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, టీఎస్‌ఐఐసి చైర్మెన్‌ బాలమల్లు, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నరసింహా రెడ్డి, తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ సుధీర్‌ రెడ్డి, పారిశ్రమికవేత్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘గత ఎనిమిదేళ్ల తెలంగాణ అభివృద్ధిలో ఇండస్ట్రీల పాత్ర ఉంది అన్నారు. అన్ని సంస్థలకి నన్ను సేల్స్‌ మెన్‌ని చేసేశారు.నేనేం రిటైర్మెంట్‌ తీసుకోను.ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లిన తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఇది ఒకరిద్దరివాళ్ళ సాధ్యపడలేదు.ఈ అభివృద్ధి వెనకాల ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి పాత్ర ఉంది అని మంత్రి తెలిపారు.ఇన్నోవేషన్‌,ఇంకుబేషన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చయిర్‌.. ట్రిపుల్‌ ఐ మంత్రతో ముందుకు వెళ్తున్నం అన్నారు. 2014లో మా ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐటీ,ఇండస్ట్రీలలోని అన్ని బాడీస్‌ తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.వాళ్ల సమస్యలు విన్నారు.ఇండస్ట్రీ ప్రో పాలసిలని తీసుకొచ్చాం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. సింగిల్‌ విండో సిస్టమ్‌, టిఎస్‌ ఐపాస్‌, టీఎస్‌ బీపాస్‌, టెక్టైల్‌, మైనింగ్‌, ఇండస్ట్రియల్‌ పాలసీ లను తీసుకొచ్చామన్నారు. స్లొగన్స్‌ చేయడం ఈజీ.. వాటిని ఇంప్లిమెంటేషన్‌ చేయడం కష్టం.అది చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు మంత్రి కేటీఆర్‌.రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు. స్పెషల్‌ ఇండస్ట్రీస్‌ స్టేటస్‌కి తెలంగాణకే కాదు..ఆంద్రప్రదేశ్‌ కి కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమి లేదని కేటీఆర్‌ విమర్శించారు. రాజకీలయలకు అతీతంగా మాకు సపోర్ట్‌ అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. .దేశం అభివృద్ధి గుజరాత్‌ ఒక్కటే కాదు.. భారత్‌లో ముంబై,హైదరాబాద్‌,బెంగుళూరు వంటి మహా నగరాలు ఉన్నాయి.వాటిని మరింత అభివృద్ధి చెయ్యాలన్నారు. .పరిశ్రమలు పర్యావరణ హితంగా పెరగాల్సిన అవసరం ఉంది అన్నారు.రాష్ట్రంలో ఐటీ,అగ్రికల్చర్‌, ఇండస్ట్రీస్‌ గ్రోత్‌ పెరుగుతూనే ఉంది.స్వతత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది.మనం ముందు భారతీయులం.ఆ తర్వాతే ఆయా ప్రాంతాల వాళ్ళం అని కేటీఆర్‌ తెలిపారు.చైనా గ్రోత్‌ 16% ఉంటే భారత్‌ డి 3 శాతం ఉంది. చైనా అమెరికా వంటి దేశాలతో పోటీ పడుతుంటే మనం పాకిస్థాన్‌,బాంగ్లాదేశ్‌ తో పోటీకి దిగుతున్నామని అన్నారు. అభివృద్ధి కోసం అందరం కలిసి పని చెయ్యాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img