Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసు…ఉస్మానియ ఆసుపత్రికి నిందితులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జూబ్లీహిల్స్‌ మైనర్‌ బాలిక సామూహిక అత్యాచారం కేసు విచారణ నేడు మొదలైంది. ఇందులో భాగంగా ఐదుగురు మైనర్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మొదట జువైనల్‌ హోంకు వెళ్లిన పోలీసులు ఐదుగురు మైనర్లను జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. మేజర్‌, ఈ కేసులో ఏ1 అయిన సాదుద్దీన్‌తో పాటు ఈ కేసులో అందరూ నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులందరికి ఉస్మానియాలోని ఫోరెన్సిక్‌ విభాగంలో లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రికి తరలించారు. కోర్టును వారం రోజుల కస్టడీ కోరగా మూడు రోజులపాటు కస్టడీకి అనుమతి లభించింది. దాంతో ఇవాళ్టి నుంచి ఈ నెల 14వరకు మూడు రోజులపాటు విచారణ ప్రక్రియ కొనసాగనుంది. మైనర్ల విచారణకు జువైనల్‌ హోమ్‌లో ఏర్పాట్లు చేయాలని పోలీసులు పర్యవేక్షకుడిని కోరారు. నేటి ఉదయం మైనర్‌ నిందితులో పాటు ఏ1 సాదుద్దీన్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. జువైనల్‌ హోమ్‌ నుండి ఉస్మానియా ఆసుపత్రికి మైనర్‌ నిందితులను, సాదుద్దీన్‌ను తరలించారు. అక్కడ మొదట ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌కు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. మైనర్లకు ప్రత్యేకంగా వైద్య నిర్వహించాలని భావించారు. కానీ ప్రత్యేక ఏర్పాట్లు చేయలేమని పర్యవేక్షకుడు స్పష్టం చేయడంతో వారిని మూడు ప్రైవేట్‌ వాహనాలలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఆరుగురు నిందితులను తరలించనున్నారు.
కోర్టు మూడు రోజులక కస్టడీకి ఇవ్వడంతో ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు జువైనల్‌ హోమ్‌ నుంచి తరలించి జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లోనే విచారించాలని పోలీసులు నిర్ణయించారు. విచారణ పూర్తయిన తరువాత ప్రతిరోజూ సాయంత్రం తిరిగి జువైనల్‌ హోమ్‌లో మైనర్‌ నిందితులను అప్పగించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img