Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

టీఎస్‌పీఎస్సీ..పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ జాతరలో భాగంగా టీఎస్పీఎస్సీ పలు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 25న వ్యవసాయ అధికారి నియామక పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపింది. మే 7న డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నియామక పరీక్ష మే 13న పాలిటెక్నిక్‌ లెక్చరర్ల నియామక పరీక్ష మే17న ఇంటర్‌ సాంకేతిక విద్యాశాఖల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ నియామక పరీక్షలను నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంది. అయితే ఈ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు.
మరో వైపు వ్యవసాయ అధికారి ఉద్యోగాల దరఖాస్తుల గడువును పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. అయితే దీనితో పాటుగా గ్రూప్‌4 దరఖాస్తులను మరో ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడిరచింది. ఇప్పటివరకు 8,47,277 దరఖాస్తులు స్వీకరించినట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. అయితే నోటిఫికేషన్‌ ద్వారా 8,180పోస్టులను భర్తీ చేయనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img