Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

టీఎస్‌పీఎస్‌సీ పరీక్ష రద్దు చేయకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా..

ప్రభుత్వానికి ప్రవీణ్ కుమార్ అల్టిమేటం..
టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. లీకేజ్ కేసును టేకప్ చేసిన సిట్.. అన్ని కోణాల్లో ఆరాతీస్తోంది. పది రోజుల్లోనే కేసును ఓ కొలిక్కి తెస్తామని సిట్ చీఫ్‌ ఏఆర్ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ప్రవీణ్, రేణుక వ్యవహారం.. ఏయే ప్రశ్నాపత్రాలను లీక్ చేశారు.. అనే విషయాలపై విచారణ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దీూూ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 48 గంటల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్1 పరీక్షను రద్దు చేయకపోతే హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. టిఎస్‌పీఎస్‌సీ బోర్డుని రద్దు చేసి, తిరిగి కొత్తగా నియమించాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ జనార్దన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌లీక్‌కి పాల్పడి వేలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. చైర్మన్ దగ్గర ఉండాల్సిన పాస్వర్డ్ సెక్రెటరీ దగ్గరికి ఎలా వెళ్ళిందని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక పెద్ద పెద్ద మనుషులే ఉన్నారని రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. ఈ క్రమంలోనే.. హైటెన్షన్‌ నెలకొంది. పలు పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు దశలవారీగా ధర్నాలకు దిగాయి. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించింది ఏబీవీపీ. లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో బారికేడ్లను దాటుకుని ముందుకెళ్లే ప్రయత్నంలో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అనంతరం పీఎస్‌కు తరలించారు. లీకేజీలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిచాంచాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ నేతలు. ఏబీవీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా టీఎస్‌పీఎస్‌సీ వైపు దూసుకొచ్చారు ఆప్‌ విద్యార్థి సంఘం నేతలు. టీఎస్‌పీఎస్‌సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తానికి లీకేజ్ ఎపిసోడ్‌ తెలంగాణను కుదిపేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img