Friday, April 26, 2024
Friday, April 26, 2024

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అరెస్ట్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లి తమ వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. తొలుత లంగర్‌హౌస్‌ పీఎస్‌ వైపు తీసుకెళ్లిన పోలీసులు..చివరకు గోల్కొండ పీఎస్‌కు తరలించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయకపోవడం సహా, ఇచ్చిన హమీలు అమలు చేయలేదని ఇటీవల రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు రేవంత్‌ పిలుపునిచ్చారు. వివిధ రకాలుగా నిరసన తెలపాలని యువజన కాంగ్రెస్‌కు సూచించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు జూబ్లీహిల్స్‌ ఇంటి వద్ద రేవంత్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img