Friday, April 26, 2024
Friday, April 26, 2024

తుర్రెబాజ్‌ ఖాన్‌ మెట్రో స్టేషన్‌గా మార్చాలి : కాంగ్రెస్‌

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : తెలంగాణా కాంగ్రెస్‌ సారధ్య బృందం అధ్వర్యములో హైదరాబాద్‌ కోఠీ లో అశోకా స్థూపం వద్ద హైదరాబాద్‌ విలీన దినోత్సవాని నిర్వహించారు. ఈ సందర్భంగా కోఠి మెట్రో రైల్‌ స్టేషన్‌ను తుర్రెబాజ్‌ ఖాన్‌ మెట్రో రైల్‌ స్టేషన్‌గా మార్చాలని డిమాండ్‌ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ.రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ విలీన పొరాటములో హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ అధ్వర్యములో జరిగిన పొరాటము మరువలేనిదని, నిజాం ఆంక్షలు విధించినా, జైల్లో పెట్టినా, కాంగ్రెస్‌ నాయకులు అలుపెరుగని పొరాటము చేశారని వివరించారు. ఈ రోజు గొప్పలు చెబుతున్న బీజేపీి పాత్ర ఆ పోరాటములో సున్నా అని, పోరాటం చేసింది, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు లేనన్నారు. అధికారములో లేనప్పుడు 17 సెప్టెంబర్‌ను అధికారికముగా ఎందుకు చేయ్యరని ప్రశ్నించిన కె.సి.ఆర్‌ అధికారములోకి వచ్చి, మాట మార్చడము తగదన్నారు. జి.నిరంజన్‌ మాట్లాడుతూ బ్రిటిష్‌ పరిపాలనకు వ్యతిరేకముగా 1857 లో దేశములో జరిగిన సిపాయి తిరుగుబాటు చరిత్ర మ్యాప్‌ లో హైదరాబాద్‌ పేరు తుర్రెబాజ్‌ ఖాన్‌ తిరుగుబాటు వలననే చోటు చేసుకుందని తెలిపారు. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకముగా తుర్రెబాజ్‌ ఖాన్‌ అధ్వర్యములో 17 జులై 1857 న కోఠి లోని బ్రిటిష్‌ రెసిడెన్సీ పై (ప్రస్తుత వుమెన్ష్‌ కాలేజ్‌) దాడి జరిగిందని పేర్కొన్నారు. అక్కడ నుండి తప్పించుకున్న ఆయనను 22 జులై న అరెస్టు చేసి జీవిత ఖైదు శిక్ష విధించారు. తుర్రెబాజ్‌ ఖాన్‌ పకార్తము కోఠి మెట్రో రైల్వే స్టేషన్‌ ను తుర్రెబాజ్‌ ఖాన్‌ మెట్రో రైల్‌ స్టేషన్‌ గా నామకరణం చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకులు వి.హనుమంత్‌రావు, కోదండరెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్‌, మాజీ ఎం.ఎల్‌.సి కమలాకరరావు, జి.కన్నయ్య లాల్‌, పి.రాజేష్‌ కుమార్‌, రాజేందర్‌ రాజు, జి.రాజరత్నం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img