Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలంగాణకు ఏమి ఇచ్చారో ప్రజల ముందు శ్వేతపత్రం పెట్టాలి

కేంద్ర ప్రభుత్వ విధానాలు, కేంద్రంలోని బీజేపీ పాలనపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు
కేంద్ర ప్రభుత్వ విధానాలు, కేంద్రంలోని బీజేపీ పాలనపై తెలంగాణ అధికార పార్టీ నేతలు తరచుగా విమర్శలు చేస్తున్నారు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏ మేర పారదర్శకంగా వ్యవహరిస్తుందో, పక్షపాత ధోరణి లేకుండా పాలన సాగిస్తుందో తెలుసుకునేందుకు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తనదైన శైలిలో ప్రశ్నించారు. గడిచిన 8 ఏళ్లలో ఎంత మంది బీజేపీ నేతలు, వారి సన్నిహితులు, సంబంధించిన వారిపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు నిర్వహించారో చెప్పాలని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. బీజేపీలో ఉన్న వారంతా సత్య హరిశ్చంద్రునికి సంబంధీకులా అని సెటైర్‌ పేల్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు హక్కుగా రావాల్సినవి ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధికి సహకరించకపోయినా, కేసీఆర్‌ నాయకత్వంలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నామని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమి ఇచ్చారో ప్రజల ముందు శ్వేతపత్రం పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img