Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలంగాణలో పాలిసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ విడుదల చేశారు. జూన్‌ 30న 365 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వించారు. పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులతోపాటు అగ్రికల్చర్‌, హార్టికల్టర్‌ సీట్లను పాలిసెట్‌ ర్యాంక్‌ ఆధారంగా భర్తీ చేయనున్నారు.రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం జూన్‌ 30న పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 1,04,432 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 75.73 శాతం మంది అంటే 79,038 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిలో బాలురు 40,669 మంది అంటే 72.12 శాతం, బాలికలు 38,369 మంది అంటే 79.99 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పాలిసెట్‌ ఎంపీసీ విభాగంలో 75.73 శాతం మంది, బైపీసీ విభాగంలో 75.81 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. నేడు పాలిసెట్‌ నోటిఫికేషన్‌ పాలిసెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ప్రకటించారు. జులై 18 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభవుతాయని, ఆగస్టు 15 వరకు అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, వెటర్నరీ, హార్టికల్చర్‌ వర్సిటీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img