Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తెలంగాణ మహిళా లోకం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటుంది

: మంత్రి సత్యవతి రాథోడ్‌

తెలంగాణ మహిళా లోకం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహిళల సంక్షేమం, భద్రత, రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో సంక్షేమ తెలంగాణ సాకారంపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రి సత్యవతి రాథోడ్‌ బలపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. గత పాలకులు మహిళా సంక్షేమానికి రూ. నాలుగున్నర కోట్లు ఖర్చు చేస్తే.. గడిచిన ఏడేండ్లలో సీఎం కేసీఆర్‌ రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పుకొచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ పథకాలతో పాటు ఒంటరి మహిళ పెన్షన్లు, వితంతు పెన్షన్లు అమలు చేస్తున్నారని అన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహాలు తగ్గిపోయాయి. పిల్లల ఎదుగుదల, పెరుగుదల కోసం అంగన్‌వాడీ సెంటర్ల నుంచి బాలామృతంతో పాటు కోడిగుడ్లు అందిస్తున్నామని తెలిపారు.మన పథకాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రశంసించిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img