Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

త్వరలో బొగ్గు కార్మికులతో వేతన ఒప్పందం

సీఐఎల్‌ చైర్మన్‌

న్యూదిల్లీ : బొగ్గు కార్మికులతో వేతన సవరణ ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా కుదుర్చుకోవడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కోల్‌ ఇండియా (సీఐఎల్‌) చైర్మన్‌ ప్రమోద్‌ అగర్వాల్‌ తెలిపారు. సీఐఎల్‌ కార్మిక శక్తిలో 90శాతానికిపైగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌ యేతర కార్మికుల వేతనాలను ఐదేళ్లకొకసారి సమీక్షిస్తారు. తాజా వేతన సవరణ 2021, జులై 1 నుంచి పెండిరగ్‌లో ఉంది. ఇది జరిగితే 2.39లక్షల మంది కార్మికులకు ప్రయోజనం ఉంటుంది. గతేడాది జులై 17న ఇందుకు సంబంధించి చర్చలు మొదలయ్యా యి. జాతీయ బొగ్గు వేతన ఒప్పందం 11 (ఎన్‌సీడబ్ల్యూఏ11)ఖరారు చేసేలా చర్చించేందుకు గాను గత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు పరిశ్రమ సంయుక్త ద్వైపాక్షిక కమిటీ (జేబీసీసీఐ)తో సీఐఎల్‌ మూడుసార్లు సమావేశం అయింది. ఇరు వర్గాలకు లాభదాయకంగా ఉండే విధంగా సఖ్యమైన ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసేందుకు ఎన్‌సీడబ్ల్యూఏ11, సీఐఎల్‌ కట్టుబడి ఉన్నట్లు కంపెనీ 202111 వార్షిక నివేదికలో అగర్వాల్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img