Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసు

కవిత ఈడీ విచారణపై ఉత్కంఠ

. దిల్లీకి రావాలని దర్యాప్తు సంస్థ పిలుపు
. 15న వస్తానన్న బీఆర్‌ఎస్‌ మహిళా నేత
. స్పందించని ఈడీ… రాజధానికి పయనం

దిల్లీలో వెలుగుచూసిన మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే సీబీఐ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితకు ఇప్పుడు ఈడీ కూడా నోటీసులు ఇవ్వడంతో ఏం జరగబోతుందన్న దానిపై బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో టెన్షన్‌ మొదలైంది. ఏకకాలంలో విచారణ జరుపుతున్న దర్యాప్తు సంస్థల్లో సీబీఐ కొందరిని ప్రశ్నించడానికి మాత్రమే పరిమితం కాగా… ఈడీ మాత్రం ఇందుకు భిన్నంగా అరెస్టులు చేస్తోంది. దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అరెస్టు తర్వాత అందరి దృష్టి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపైనే ఉంది. అరుణ్‌ పిళ్లై రిమాండ్‌ రిపోర్ట్‌ నేపథ్యంలో తాజాగా ఈడీ… దిల్లీలో 9న విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు ఇవ్వడంతో ఆమె అరెస్టుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే దిల్లీలో దీక్షకు సిద్ధమవుతున్నామని, అది ముగిసిన తర్వాత ఎప్పుడైనా విచారణకు సిద్ధమని కవిత ఈడీకి లేఖ రాశారు. దీనికి ఈడీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆమె హుటాహుటిన దిల్లీ పయనమయ్యారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో తన కుమార్తెకు కేసీఆర్‌ ధైర్యం చెప్పారు. ఆందోళన చెందొద్దని, బీజేపీపై న్యాయపరంగా పోరాడదామని ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. దిల్లీలో తలపెట్టిన కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కవితకు సూచించారు. మరోవైపు దిల్లీ చేరుకున్న కవిత గురువారం ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img