Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. మహిళల కోసం ఆరోగ్య మహిళ పథకం ప్రారంభం

100 ఆస్పత్రుల్లో ఆ పరీక్షలన్నీ ఫ్రీ

కరీంనగర్‌లో పథకాన్ని ప్రారంభించిన మంత్రులు గంగుల, హరీశ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆడపడుచుల కోసం తెలంగాణ సర్కార్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే.. మహిళల కోసం పలు పథకాలను తీసుకువచ్చింది తెలంగాణ సర్కార్.. ఆరోగ్య మహిళ అనే పథకాన్ని ప్రారంభించింది. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే ఎనిమిది రకాల ఆరోగ్య సమస్యలకు సర్కారు ఉచితంగా వైద్యం అందించనుంది. ప్రతి మహిళా ఆరోగ్యంతో ఉండాలనేదే ఈ పథకం ఉద్దేశం. కాగా.. ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి.. కరీంనగర్‌లో ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను ప్రారంభించారని.. అందులో భాగంగానే మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య మహిళ పథకాన్ని తీసుకొచ్చారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గాయని.. మంచి నీరు ఇంటింటికి అందిస్తున్నామని.. బాలికల రెసిడెన్సిల్ పాఠశాలలు ప్రారంభిచామని తెలిపారు. ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా అనే కార్యక్రమాన్ని ప్రాతంభించుకున్నామన్నారు. మహిళలు అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఆసుపత్రిలో చూపించుకోవడం లేదన్న హరీశ్ రావు.. మొత్తం 8 రకాల వ్యాధులకు సంబంధించి ఉచిత ట్రీట్‌మెంట్ అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదట 100 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రానున్న రోజుల్లో వీటి సంఖ్య పెంచుతాం .ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పెద్దపెద్ద ఆసుపత్రులలో అందె అన్ని చికిత్సలు ఇక్కడ లభిస్తాయి. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. 40 నుంచి 50 శాతం మంది మహిళలు వివిధ రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు అని ఒక సర్వే లో తేలింది. ప్రతి ఒక్కరు ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. శ్రీరామనవమి తరువాత న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. బిడ్డ కడుపులో పడగానే ఇచ్చే కిట్ న్యూట్రిషన్ కిట్ ఇస్తామన్నారు. రక్తహీనతను అరికట్టడానికి గర్భిణీ మహిళలు 3 నుంచి 4 ఇంకొకటి 7 నెలల గర్భిణీకి ఇవ్వాలని సూచించారు. దేశంలో ఎక్కడలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నాం.ఁ అని హరీష్‌ రావు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img