Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దీపావళి పురస్కరించుకొని ఆ రూట్లలో ప్రత్యేక రైళ్లు..

దీపావళి పండుగకు ఊరెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవుతున్న తరుణంలో రైల్వేశాఖ సైతం ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు రద్దీ ఉండే రూట్లలో రైళ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బెంగళూరు-కలబురిగి మధ్య రెండు అఫ్‌ అండ్‌ డౌన ట్రిప్పుల ప్రత్యేక రైలును నడపనున్నట్లు- రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. బెంగళూరు-కలబురిగి ప్రత్యేక రైలును (నెం. 06557)ఈ నెల 22, 29 తేదీల్లో నడపనున్నట్లు తెలియజేశారు. ఈ రైలు పేర్కొన్న తేదీల్లో బెంగళూరులో ఉదయం 11-30 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు కలబురిగి చేరుకుంటు-ందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు ఈనెల 22, 29 తేదీల్లో రాత్రి 11 గంటలకు కలబురిగిలో బయలుదేరి మరసటి రోజు ఉదయం 11 గంటలకు బెంగళూరుకు చేరుతుందన్నారు. ఈ రైలు బెంగళూరు కంటోన్మెంటు-, యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుం తకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, యాద్గిర్‌, వాడి స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు. యశ్వంతపూర్‌-బీదర్‌ మధ్య కూడా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. యశ్వంతపూర్‌-బీదర్‌ మధ్య సింగిల్‌ ట్రిప్‌ ఆఫ్‌ అండ్‌ డౌన ప్రత్యేక రైలును వేసినట్లు- రైల్వే అధికారులు తెలిపారు. యశ్వంతపూర్‌-బీదర్‌ ప్రత్యేక రైలు (నెం. 06597) 22వ తేదీ (శనివారం) సాయంత్రం 5-20 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరి రాత్రి 10-45 గంటలకు గుంతకల్లుకు వచ్చి మరుసటిరోజు ఉదయం 7 గంటకు బీదర్‌కు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం. 06598) 23వ తేదీ ఆదివారం రాత్రి బీదర్‌లో 7-50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3-55 గంటలకు గుంతకల్లుకు వచ్చి, పదిన్నరకు యశ్వంతపూర్‌కు చేరుకుంటు-ందన్నారు. ఈ రైలు యల్హంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, యాద్గిర్‌, వాడి, కలబురిగి స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img