Friday, April 26, 2024
Friday, April 26, 2024

పంటల సాగుపై కూడా దరిద్రపు రాజకీయాలు : సీఎం కేసీఆర్‌

గద్వాల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిరిగివస్తూ పెబ్బేర్‌ మండలం రంగాపూర్‌లో ఆగి జాతీయ రహదారి 44 పక్కన ఉన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో సీఎం మాట్లాడారు. ఆరుతడి పంటలే వేయాలని కేసీఆర్‌ రైతులకు సూచించారు. దీంతో రాజకీయ చీడ కూడా తొలగిపోతుందని కేసీఆర్‌ అన్నారు. వానాకాలంలో వరి పంట వేసుకుని, యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. పంటల సాగుపై కూడా దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారు.. యుద్ధాలే జరుగుతున్నాయని అన్నారు. సీఎం వెంట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img