Friday, April 26, 2024
Friday, April 26, 2024

పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ఎంతో కృషి

‘టూరిజం షార్ట్‌ ఫిల్మ్‌’ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
‘సోమశిల’ పై ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్‌ దూలం సత్యనారాయణ రూపొందించిన ‘టూరిజం షార్ట్‌ ఫిల్మ్‌’ను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆవిష్కరించారు.హైదరాబాద్‌లోని తన క్యాంప్‌ కార్యాలయంలో తెలంగాణ టూరిజం ప్రమోషన్‌లో భాగంగా మంత్రి షార్ట్‌ ఫిల్మ్‌’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాల విశిష్టత పై ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్‌ దూలం సత్యనారాయణ నేతృత్వంలో టూరిజం షార్ట్‌ ఫిల్మ్‌ లను రూపొందించి తగిన ప్రచారాన్ని నిర్వహిస్తున్నామన్నారు.కార్యక్రమంలో జయప్రకాష్‌ నారాయణ విద్యా సంస్థల చైర్మన్‌ రవికుమార్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ల సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి, ఉద్యోగుల సంఘం నాయకులు మోహన్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img