Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ని ప్రారంభించిన కేసీఆర్‌

రూ.600 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రభుత్వం
దేశంలోనే తొలి పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ భవనాన్ని గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జాతికి అంకితమిచ్చారు. ప్రగతి భవన్‌ నుంచి పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్దకు చేరుకున్న కేసీఆర్‌కి డీజీపీ మహేందర్‌రెడ్డి, సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తదితరులు ఆహ్వానం పలికారు. అనంతరం పోలీసులు గౌరవం స్వీకరించిన కేసీఆర్‌కి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రూ.600 కోట్లతో బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 12లో ఏడెకరాల విస్తీర్ణంలో 19 అంతస్తుల్లో నిర్మించిన ఈ ఐకానిక్‌ భవనంలో ఐదు టవర్లున్నాయి. 6.42లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం ఎత్తు 83.5మీటర్లు. ఇందులోని టవర్‌ ‘ఎ’ని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి, టవర్‌ ‘బి’ని టెక్నాలజీ విభాగానికి కేటాయించారు. 2016 నవంబర్‌ 22న శంకుస్థాపన జరుపుకున్న కమాండ్‌ కంట్రోల్‌ భవనం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఆరేళ్ల సమయం పట్టింది. 19 అంతస్తులున్న ఈ భవనంలో సందర్శకులు 14, 15 అంతస్తుల వరకు వెళ్లేందుకు అధికారులు అనుమతిస్తారు. అక్కడి నుంచి భాగ్యనగరాన్ని 360 డిగ్రీల కోణంలో వీక్షించొచ్చు. అయితే దీనికోసం కొంత ఛార్జీ వసూలు చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించనున్నారు. ఆ సీసీ కెమెరాల ఫుటేజీని.. స్థానిక పోలీస్‌స్టేషన్లు, ఎస్పీ, కమిషనర్‌ స్థాయి కార్యాలయాలతో పాటు ఈ కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా 365 రోజులు, 24/7 గంటలు వీక్షించే అవకాశం ఉంటుంది. ఆ సీసీ ఫుటేజీని 30 రోజుల దాకా భద్రపరిచే ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. ప్రత్యేక బ్యాక్‌ ఎండ్‌ బృందాలు నిరంతరం వాటిని పరిశీలిస్తూ రాష్ట్రంలోని ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఏం జరిగినా వెంటనే గుర్తించి అక్కడి అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు క్షణాల వ్యవధిలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img