Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రతి విద్యార్థి పరీక్షలను పండుగల్లా భావించాలి : మంత్రి హరీశ్‌రావు

ప్రతి విద్యార్థి పరీక్షలను పండుగల్లా భావించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పదో తరగతి చదివే విద్యార్థుల మెరుగైన ఫలితాల కోసం వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఉత్తరం రాస్తానని అన్నారు. పదో తరగతి పరీక్షల దృష్ట్యా స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టి సిద్ధిపేట జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి సూచించారు. జిల్లా కేంద్రంలోని సిద్ధిపేట న్యూ హైస్కూల్‌లో ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ రాగి గంగారాం సహకారంతో రూ.25 లక్షలతో నిర్మించిన భోజనశాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను చదివిన పాఠశాలకు డైనింగ్‌ హాల్‌ కట్టించి, అందరికీ గంగారాం స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్య బోధన ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.7300 కోట్లు వెచ్చించి కార్పోరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ సకల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా విద్యాశాఖ అధికారులు, టీచర్లు కృషి చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img